ETV Bharat / state

సీఎం జగన్​ పర్యటన.. ప్రతిపక్షనేతల గృహనిర్బంధాలు.. జనం నవ్వుకుంటున్నారన్న నాదెండ్ల

OPPOSITION LEADERS HOUSE ARREST : సీఎం జగన్‌ తెనాలి పర్యటన సందర్భంగా పోలీసులు విపక్ష పార్టీలకు చెందిన నేతలను, నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తారన్న అనుమానంతో కొందరిని గృహ నిర్బంధం చేశారు. మరో వైపు అక్రమ అరెస్టులపై జనసేన పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల విమర్శించారు.

author img

By

Published : Feb 28, 2023, 3:18 PM IST

OPPOSITION LEADERS HOUSE ARREST
OPPOSITION LEADERS HOUSE ARREST

OPPOSITION LEADERS HOUSE ARREST : సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు తెలుగుదేశం, జనసేన నేతల కదలికలపై ఆంక్షలు విధించారు. వైఎస్సార్​ రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తారనే అనుమానంతో టీడీపీ, జనసేన నేతలను అరెస్టు చేశారు. ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు.

సోమవారం అర్ధరాత్రి నుంచే పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఫోన్లు చేసి స్టేషన్​కు రావాలని ఒత్తిడి చేశారు. రాకపోయే సరికి వారిని తీసుకువచ్చి స్టేషన్​లో కూర్చోబెట్టారు. రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేం లేదని టీడీపీ, జనసేన నేతలు రెండు రోజులుగా విమర్శలు చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని నిర్బంధించారు. కనీసం ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకపోవటంపై టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనం నవ్వుకుంటున్నారు: అధికారులకు, అధికార పార్టీ నాయకులకు ఎందుకు అంత అభద్రతా భావమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ తెనాలి పర్యటనకు వస్తుంటే జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని నిలదీశారు. సీఎం వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని.. ఏ చట్టం చెబుతోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా జగన్​కు భయమని.. అందుకే ఆయన తెనాలి పర్యటనకు వస్తుంటే ఎటువంటి ప్రకటనలు చేయకుండా కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. తాడేపల్లి నుంచి తెనాలికి జగన్‌ హెలికాప్టర్‌లో వెళ్లడాన్ని సైతం మనోహర్‌ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

  • తన ప్యాలెస్ నుంచి తెనాలికి 28 కిమీ. ఈ మాత్రం దూరం కూడా రోడ్డు ప్రయాణం చేయలేరా?

    •తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళడం ఏమిటి? జనం నవ్వుకొంటున్నారు.

    •జనం సొమ్ము జగన్ హెలీకాప్టర్ పర్యటనల పాలవుతోంది. హెలికాప్టర్ డబ్బులతో రోడ్లు బాగవుతాయి.

    — JanaSena Party (@JanaSenaParty) February 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రోడ్డు మీద వెళ్తే గుంతలు.. పాడైపోయిన రోడ్లు ఉంటాయని సీఎం హెలికాప్టర్‌లో వెళ్తున్నారా అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి తెనాలికి 28కి.మీ మాత్రమే ఉంటుందని.. ఈ మాత్రం దూరం కూడా జగన్‌ రోడ్డు ప్రయాణం చేయలేరా అని నిలదీశారు. అంత తక్కువ దూరానికి హెలికాప్టర్‌లో వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించిన నాదెండ్ల.. జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జనం సొమ్ము సీఎం హెలికాప్టర్ల పర్యటనల పాలవుతోందని విమర్శించారు. హెలికాప్టర్‌కు పెట్టే డబ్బులతో రోడ్లు బాగవుతాయని.. ప్రజల్ని గతుకు రోడ్ల పాలుజేసి.. జగన్‌ మాత్రం హెలికాప్టర్‌లో తిరుగుతున్నారని నాదెండ్ల విమర్శించారు.

పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు: సీఎం సభకు స్వచ్చందంగా వస్తామంటే.. పోలీసులు ఎందుకు నిర్బంధిస్తున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సభకు అనుమతిలేదంటూ.. జనసేన నేతలను పార్టీ కార్యాలయంలో పోలీసులు నిర్బంధించారన్నారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని అంబేద్కర్ విగ్రహం ఎదుట జనసైనికులు నిరసన చేపట్టారు. సీఎం పర్యటనను నిరసిస్తూ... సీఎం గోబ్యాక్ ...అంటూ నినాదాలు చేశారు. సభలకు బలవంతంగా జనాలను తెచ్చుకునే దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని గాదె వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.