గుంటూరు జిల్లా బాపట్లలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు దూరంగా ఉంటున్న 28 మందిని గుర్తించి... తమవెంట తీసుకెళ్లారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలలతో... పని చేయించుకుంటున్న కొన్ని సంస్థలకు లేబర్ యాక్ట్ ద్వారా నోటీసులు జారీ చేశారు. డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సహకారంతో... వీరి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: సాయి ఎగరేసే కీర్తి పతాకం... చిన్నబోయె కాంగ్రీ పర్వతం