ఐటీఐ విద్యాలయాల్లో ఆన్లైన్ పరీక్ష విధానాన్ని వ్యతిరేకిస్తూ... గుంటూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రవేశపరీక్షలకు ఆన్లైన్ పరీక్ష విధానం సహేతుకమని... ప్రధాన పరీక్షలను ఆన్లైన్ చేయడం సమంజసం కాదని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం... (ఏఐడీఎస్వో) రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు అభిప్రాయపడ్డారు. ఐటీఐ విద్యాలయాల్లో నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా విద్యనభ్యసిస్తారని... ఆంగ్లంలో ఉండే ఆన్లైన్ పరీక్షను రాయడం కష్టసాధ్యమన్నారు. విద్యార్థులకు అప్రెంటీస్ అవకాశాలను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ఈ ఆన్లైన్ పరీక్ష విధానాన్ని ఎత్తివేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని బసవరాజు హెచ్చరించారు.
ఇవీ చదవండి...సైబర్ నేరాలపై విద్యార్థినులకు పోలీసుల పాఠాలు