ETV Bharat / state

One district one smart town: జిల్లాకో స్మార్ట్‌ టౌన్‌.. 5 జిల్లాల్లో భూములు సిద్ధం

author img

By

Published : Jan 7, 2022, 8:40 AM IST

One district one smart town: పట్టణాల్లోని మధ్య ఆదాయ వర్గాల కోసం జిల్లాకో జగనన్న స్మార్ట్‌టౌన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఐదు జిల్లాల్లో భూములను సమీకరించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించారు. ప్రతి జిల్లాకో లేఅవుట్‌ విధిగా ఉండాలన్న ప్రభుత్వ తాజా ఆదేశాలతో మిగిలిన జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్‌ భూముల సేకరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

One district one smart town
One district one smart town

One district one smart town: పట్టణాల్లోని మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం జిల్లాకో జగనన్న స్మార్ట్‌టౌన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఐదు జిల్లాల్లో భూములను సమీకరించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేశారు. మిగిలిన జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్థిరాస్తి వ్యాపారులు విక్రయిస్తున్న రేట్ల కంటే తక్కువకు మధ్య ఆదాయ వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కార్యక్రమానికి ఏడాది కిందట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహించిన డిమాండు సర్వేలో 3.78 లక్షల కుటుంబాలు వీటిపై ఆసక్తి చూపాయి. ప్రతి పట్టణానికి ఐదు కి.మీ.దూరంలో ఎంఐజీ లేఅవుట్ల ఏర్పాటుకు మొదట్లో నిర్ణయించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు భూముల కొనుగోలు ఖర్చుతో కూడినది కావడంతో అత్యధిక జిల్లాల్లో ఇది ముందడుగు పడలేదు.

అగ్రిగోల్డ్‌ భూముల్లో, బిల్డ్‌ ఏపీ కోసం సమీకరించిన కొన్ని భూముల్లో లేఅవుట్లు వేయడం కూడా పరిశీలనకు వచ్చింది. చివరకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తొలి దశలో 5 ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధికి నిర్ణయించారు. ప్రతి జిల్లాకో లేఅవుట్‌ విధిగా ఉండాలన్న ప్రభుత్వ తాజా ఆదేశాలతో మిగిలిన జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్‌ భూముల సేకరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రైవేటు భూములను ప్రభుత్వ ధరకంటే 5 రెట్ల విలువకు మించకుండా సేకరించనున్నారు. అసైన్డ్‌ భూములను రైతులు, ప్రజల నుంచి భూసమీకరణ పథకం (ఎల్‌పీఎస్‌) కింద తీసుకోనున్నారు. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి ఎంఐజీ లేఅవుట్లను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. 150, 200, 240 చ.గజాల్లో మూడు కేటగిరీల కింద ప్లాట్లను తయారుచేసి విక్రయిస్తారు.

లేఅవుట్ల ఏర్పాటుకు భూములు సిద్ధంగా ఉన్న జిల్లాలు

ఇదీ చదవండి: MP Rammohan Naidu: 'ఆదాయ వనరులు అభివృద్ధి చేయలేకే.. చెత్తపై పన్ను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.