గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని హాఫ్పేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులు.. మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. సురేష్, ముసలయ్య అనే వ్యక్తుల బంధువులకు సంబంధించిన కర్మకాండ కార్యక్రమంలో.. ఇద్దరికి వాగ్వాదం జరిగింది. అదే సమయంలో నాగరాజు అక్కడికి వెళ్లాడు. గొడవకు గల కారణం ఏంటని ప్రశ్నించాడు.
సురేష్, ముసలయ్య అతనిపై తీవ్రంగా స్పందించారు. నీకు ఏం సంబంధం అని అతని పైకి వచ్చారు. గొడవ పెద్దదై.. తోపులాట జరిగింది. అనంతరం సురేష్, ముసలయ్య నాగరాజు పై కత్తితో దాడి చేశారు. దాడిలో నాగరాజు అరచేయి తెగింది. దీంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే.. తనపై దాడి చేశారని బాధితుడు నాగరాజు ఆవేదన చెందాడు.
ఇదీ చూడండి: