గుంటూరు జిల్లా కంటేపూడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదులు బాబు(23) మృతి చెందాడు. క్రీస్తురాజు అనే మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఘటన జరిగింది. గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ముప్పాళ్ళ ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: