గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. గుంటూరు రూరల్ మండలం గొల్లవారిపాలెం గ్రామానికి చెందిన నాగండ్ల గిరిధర్ అనే యువకునికి మతిస్థిమితం లేదు. గిరిధర్.. తాడికొండ అడ్డరోడ్డు వద్ద ప్రధాన రహదారి వెంబడి నడుస్తూ ఉండగా గుర్తుతెలియని వాహనం అతడిని ఢీ కొట్టింది. గిరిధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుని తండ్రి సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటాద్రి తెలిపారు.
ఇదీ చదవండి: