గుంటూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పాత గుంటూరు ముగ్దుంనగర్లో ఓ రేకుల షెడ్డు కూలి అందులో ఉన్న వృద్ధురాలు మేహరున్ని(75) మృతి చెందింది. స్థానికులు అప్రమత్తమై శిథిలాలు తొలగించి చూడగా ఆమె మృతి చెందింది. ఆమెతో పాటు నివాసం ఉంటున్న మరో మహిళకు గాయాలు కాగా సమీప ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలు పైన ఆరా తీస్తున్నారు.
ఇది చదవండి అచ్చెన్నాయుడి కిడ్నాప్‌కు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు