గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడులో ఓ ఉపాధ్యాయుడికి పూర్వవిద్యార్థులు విగ్రహం ఏర్పాటు చేశారు. రామినేని వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు గార్లపాడు గ్రామంలో 30ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. దాదాపు 3 వేల మందికి ఆయన విద్యాబుద్ధులు నేర్పించారు. ఇటీవల ఆయన, ప్రకాశం జిల్లా రామనూతలలో మరణించారు.
దాంతో పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు కలసి ఆ గురువును గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తమకెంతో ఇష్టమైన ఉపాధ్యాయుడి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. గురువు రామినేని వెంకటేశ్వర్లు జ్ఞాపకానికి గుర్తుగా పూర్వ విద్యార్థులు చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి.