కరోనా వైరస్ ప్రబలకుండా గుంటూరు జిల్లాలోని అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు మంగళగిరి హోటల్స్‌లో అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఆహార నాణ్యతపై తనిఖీలు చేశారు. ఆటోనగర్‌లో ఉన్న ఓ హోటల్లో నిల్వ ఉన్న చికెన్, మాంసం, చేపలను గుర్తించారు. చికెన్ తక్కువ ధరకు లభిస్తున్నా ఇంత భారీ మొత్తంలో ఎందుకు నిల్వ చేశారని హోటల్ యాజమాన్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని మిగిలిన హోటల్స్‌లోనూ దాడులు చేసి నిల్వ ఉన్న మాంసాన్ని కాలువలో పడేశారు.
ఇదీ చదవండి: కరోనా నివారణకు కేంద్రం 15 సూచనలు