గుంటూరు జిల్లా సత్తెనపల్లి పౌరసరఫరాల గోదాంలో సరుకులు తరలించే రెండు లారీలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. రేషన్ దుకాణాలకు వస్తువులను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వాహనాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సరుకుల బరువుల్లో తేడాలను గుర్తించి లారీలను సీజ్ చేశారు. గోదాంలో ఉన్న సరుకుల నిల్వలు, బరువుల వ్యత్యాసాలను తేల్చేపనిలో పడ్డారు.
ఇదీ చదవండి: