తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో క్షుద్రపూజల ఆనవాళ్లతో.. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కృష్ణ భారతి అపార్ట్మెంట్కు సమీపంలోని గుంటూరు కాలువ పక్కన ఈ ఘటన జరిగింది. కెనాల్ కట్ట రహదారిపై కోడిగుడ్డు, నిమ్మకాయ, పసుపు- కుంకుమ.. చుట్టూ రక్తం గమనించిన అక్కడి ప్రజలు.. ఆందోళనకు గురయ్యారు.
నిత్యం జనాలు తిరుగుతుండే ఈ ప్రాంతంలో గతంలోనూ క్షుద్రపూజలు జరిగాయని.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే.. మళ్లీ పునరావృతం అయ్యిందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా.. ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా పెంచాలని కోరారు.
ఇదీ చదవండి: