అమరావతి కోసం.. కువైట్‌లోనూ పోరాటం - కువైట్లో ప్రవాసాంధ్రుల నిరసన అమరావతికోసం
అమరావతి రైతుల ఆందోళన.. ప్రవాసాంధ్రులను కదిలిస్తోంది. రాజధాని పరిధిలో ఉద్ధృతమైన ఉద్యమం.. విదేశాలకు పాకింది. రాజధానిగా అమరావతే ఉండాలంటూ.. కువైట్ లో ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సేవ్ అమరావతి అని నినదించారు. చిన్నారులు సైతం.. ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారు.