ETV Bharat / state

నిజమైన 'శ్రీమంతుడు'.. ఊరికి తిరిగి ఇచ్చేస్తున్నాడు! - పెదకొండూరును అభివృద్ధి చేస్తున్న ఎన్​ఆర్​ఐ శివశంకర్ వార్తలు

పరాయి దేశంలో ఉన్నా పుట్టిన ఊరి తలపే... ఉద్యోగం చేస్తున్నా ఊరి మీద ధ్యాసే. ఈ రెండు గుణాలే.. గ్రామాభివృద్ధి వైపు ఆయనను వేలు పట్టి నడిపించాయి. బడిలో మౌలిక సౌకర్యాల కల్పనతో విద్యా వికాసానికి బాటలు పర్చగా.. గుడిని బాగు చేసి ప్రజల ఇబ్బందులనూ తీర్చారు. స్వగ్రామానికి ఇదంతా చేయడం.. రుణం తీర్చుకోవడం కాదని.. తన బాధ్యత అంటున్నారు ఈ ప్రవాసాంధ్రుడు.

నిజమైన 'శ్రీమంతుడు'.. ఊరికి తిరిగి ఇచ్చేస్తున్నాడు!

author img

By

Published : Feb 7, 2021, 7:57 PM IST

నిజమైన 'శ్రీమంతుడు'.. ఊరికి తిరిగి ఇచ్చేస్తున్నాడు!

'ఊరి నుంచి ఎంతో తీసుకున్నారు.. తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతారు' అని ఓ సినిమాలో మహేశ్‌బాబు చెప్పాడు. అయితే.. అంతకు ఎన్నో ఏళ్ల ముందే.. ఈ పెద్దాయనకు ఆ ఆలోచన స్ఫురించింది. తదనుగుణంగా అడుగులు వేసి ఊరివాసుల చేత శభాష్‌ అనిపించుకున్నారు. ఆయనే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరుకు చెందిన పట్టెల శివశంకర్.

పెదకొండూరులోనే ఎంటెక్‌ వరకూ చదివిన శివశంకర్‌.. అనంతరం ఉన్నతవిద్యకు విదేశాలకు వెళ్లారు. 20 ఏళ్ల పాటు అక్కడే పనిచేశారు. స్వగ్రామానికి ఏదైనా చేయాలన్న ఆలోచన.. ఆయనను తొలిచేసేది. అప్పటికే పెదకొండూరుకు ఉన్నత పాఠశాల మంజూరైనా.. భవనాల నిర్మాణానికి నిధుల్లేవు. గ్రామస్థులు శివశంకర్‌ను సంప్రదించారు. గ్రామంలో హైస్కూల్‌ లేకపోవడం వల్ల వేరే ఊరికి నడిచి వెళ్లి చదువుకున్న తన చిన్నతనాన్ని గుర్తుచేసుకున్న శివశంకర్‌.. నిర్మాణానికి అవసరమైన 70లక్షలు సమకూర్చారు. పాఠశాలలో కంప్యూటర్లూ పెట్టించారు. సీసీ కెమెరాలూ ఏర్పాటు చేయించారు. ఇలా బడి బాగు కోసం కోటి రూపాయలకుపైగా ఖర్చు చేశారు.

కేవలం బడితోనే శివశంకర్ ఆగిపోలేదు. గ్రామంలో పశువుల ఆసుపత్రికి భవనం నిర్మించారు. ప్రస్తుతం దానిని రైతు భరోసా కేంద్రంగా వినియోగిస్తున్నారు. ఆధ్యాత్మికతపై తనకున్న ఆసక్తితో గ్రామంలోని గుడులను అభివృద్ధి చేయాలని భావించారు. కనక పుట్లమ్మ ఆలయంలో కళ్యాణ మండపం, భోజనశాల, జనార్ధన స్వామి ఆలయంలో కళ్యాణమండపం నిర్మించారు. గ్రామంలో శ్మశానం సరిగా లేక ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించారు. దాన్ని కూడా బాగు చేయాలని సంకల్పించారు. రూ.30 లక్షలతో అక్కడ అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తనకు సంతృప్తి ఇచ్చిన విషయం శ్మశానం బాగు చేయటమని సంతోషంగా చెబుతారు.

గ్రామంలోని మౌలిక వసతులను తన తల్లిదండ్రుల పేరు మీద నిర్మించారు శివశంకర్. విదేశాల నుంచి తిరిగొచ్చాక ఇక్కడే ఇల్లు కట్టుకుని శేషజీవితాన్ని గడుపుతున్నారు.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్​ విపత్తు: 150 మంది కార్మికులు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.