ETV Bharat / state

నరసరావుపేటలో ఆగని వైరస్‌ వ్యాప్తి.. వంద దాటిన కేసులు - Non-stop virus spread in Narasaraopet

నరసరావుపేట పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

guntur district
నరసరావుపేటలో ఆగని వైరస్‌ వ్యాప్తి..వంద దాటిన కేసులు
author img

By

Published : Apr 30, 2020, 12:00 PM IST

కరోనా వైరస్‌ మహమ్మారి గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఒక్క రోజులోనే పట్టణంలో 26 కేసులు నమోదవటంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 102కి చేరింది. రోజు రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాకు కేంద్ర బిందువుగానున్న పట్టణంలోని వరవకట్టలో 81 మంది బాధితులు తేలారు. మిగిలిన 21 కేసులు పేటలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి. తొలుత పాజిటివ్‌ కేసు నమోదైన వరవకట్టపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం తమకు శాపంగా మారిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. వైరస్‌ వచ్చిన ప్రాంతంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేయడంలో అధికారులు శ్రద్ధ చూపలేదు. దాని పర్యావసానంగా ఇప్పుడు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందని చెబుతున్నారు. ఇంకా వరవకట్ట, రామిరెడ్డిపేట తదితర ప్రాంతాలకు చెందిన 500 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకెన్ని కేసులు నమోదవుతాయోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరవకట్టలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలో పర్యటించిన ఆయన ఇంటింటా సర్వేను పర్యవేక్షించారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ

కేసుల తీవ్రత నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నరసరావుపేటపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఇప్పటికే పలుమార్లు పేటలో పర్యటించారు. ఐజీ ప్రభాకరరావు, ఎస్పీ విజయరావు పట్టణంలో పర్యటించారు. ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వైరస్‌ వ్యాప్తి మూలాలను గుర్తించటడంపై దృష్టి సారించారు.

ఏప్రిల్‌ 9న నరసరావుపేటలో తొలి కేసు నమోదైంది. కేసుల సంఖ్య ఆ వారంలోనే ఏడుకి చేరింది. నెమ్మదిగా పెరుగుతూ వస్తూ ఏప్రిల్‌ 20 నాటికి కేసుల సంఖ్య 25కి చేరింది.ఏప్రిల్‌ 20 తరువాత కేసుల ఉద్ధృతి పెరిగింది. కేసుల 25వ తేదీ నాటికి 44 కేసులు ఉండగా, నాలుగు రోజుల వ్యవధిలో ఒక్కసారిగా రెట్టింపు అయింది. బుధవారం పట్టణంలో నమోదైన 26 కేసుల్లో ఒక్క వరవకట్టలోనే 25 కేసుల నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తోంది.

రోడ్లపైకి వస్తే క్వారంటైన్‌కే

పౌరులు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే క్వారంటైన్‌కు పంపుతామని గ్రామీణ ఎస్పీ విజయరావు హెచ్చరించారు. పట్టణంలో రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఆయన పర్యటించారు. వరవకట్ట, నిమ్మతోట, ఏనుగుల బజారు, పాతూరు, పెద్దచెరువు, రామిరెడ్డిపేటల్లో పర్యటించి లాక్‌డౌన్‌ అమలును స్వయంగా పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. పలుచోట్ల రోడ్లపై యువకులు కనిపించటంతో వారిని మందలించారు. పలు కూడళ్లలో అంతర్గత రోడ్లను మూసివేయాలని పోలీసులకు సూచించారు. సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి, డీఎస్పీ వీరారెడ్డి, సీఐలు, ఎస్సైలు ఆయన వెంట ఉన్నారు.

పకడ్బందీగా సంపూర్ణ లాక్‌డౌన్‌

నరసరావుపేట పట్టణంలో వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పట్టణంలో బుధ, గురువారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించిన యంత్రాంగం పకడ్బందీగా అమలుచేస్తోంది. పట్టణాన్ని పూర్తిగా దిగ్బంధం చేసి ప్రజల రాకపోకలు నియంత్రించారు. పట్టణంలోకి బయటి వ్యక్తులు రాకుండా రాకపోకలను కట్టడి చేశారు. బుధవారం పట్టణ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పౌరులు రోడ్లపైకి వస్తే క్వారంటైన్‌కు తరలిస్తామని పోలీసులు ప్రచారం చేయటంతో ప్రధాన రహదారుల్లో ఎక్కడా జన సంచారం కనిపించలేదు.

డీఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో బందోబస్తు నిర్వహించారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించారు. ఎక్కడైనా జనం బయట ఉన్నట్లు కనిపిస్తే తక్షణం అక్కడకు పోలీసులను పంపారు. మరోవైపు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో కలిసిన వ్యక్తులందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇంటింటి సర్వే చేస్తూ కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అధికార యంత్రాంగం అప్రమత్తమై నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటోంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి... కొత్తగా 73 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.