ETV Bharat / state

ఎంపీడీవో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు..! - ఏపీలో స్థానిక ఎన్నికలు న్యూస్

గుంటూరు జిల్లా పల్నాడులో స్థానిక ఎన్నికల ప్రారంభ దశలోనే ఉద్రిక్తత నెలకొంది. వెల్దుర్తి మండలం బోయలవీడు ఎంపీటీసి తెదేపా అభ్యర్థి నామినేషన్ పత్రాలను అదే గ్రామానికి చెందిన కొంతమంది లాక్కుని వెళ్లారు. అయితే నామినేషన్​ వేసే సమయంలో వేరే వ్యక్తులు ఎంపీడీవో కార్యాలయంలోనికి వస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.

ఎంపీడీవో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు!
ఎంపీడీవో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు!ఎంపీడీవో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు!
author img

By

Published : Mar 10, 2020, 9:01 PM IST

ఎంపీడీవో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు!

గుంటూరు జిల్లా పల్నాడులో నామినేషన్ వేసేందుకు తెదేపా అభ్యర్థి నాగేంద్రం అనే మహిళ ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. నామినేషన్ పత్రాలు ఎంపీడీవోకు అందజేశారు. ఎంపీడీవో పత్రాలు పరిశీలిస్తున్న సమయంలో అభ్యర్థి గ్రామానికి చెందిన కొందరు ఎంపీడీవో కార్యాలయం లోపలికి ప్రవేశించారు. ఎంపీడీవో నుంచి నామినేషన్ పత్రాలను లాక్కుని వెళ్లారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనికి నామినేషన్లు దాఖలు చేసే సమయంలో వారిని తప్ప ఇతరులను అనుమతించరు. కానీ వేరేవ్యక్తులు లోపలకు వస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తమని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని తెదేపా అభ్యర్థి నాగేంద్రం ఆరోపించారు. రెండు రోజుల నుంచి తమని బెదిరిస్తున్నారని... ఎలాగోలా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి నామినేషన్ వేసే సమయంలో లాక్కెళ్లారని వాపోయారు.

ఇదీ చదవండి:

ఎన్నికల వింత: ఒకే వ్యక్తి.. తొమ్మిది ఓట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.