ETV Bharat / state

NO RTC Bus Facility for Villages in AP: పల్లెలకు దూరంగా ప్రగతి రథచక్రాలు.. వైసీపీ ప్రభుత్వ పుణ్యమా అని ప్రజారవాణా సేవలకు నోచుకోని గ్రామాలు..

NO RTC Bus Facility for Villages in AP: వైసీపీ పాలనలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా పల్లె ప్రజలకు సరిపడా సంఖ్యలో సర్వీసులను అర్టీసీ అందిచలేకపోతోంది. మా ఊరికి బస్సు లేదు బస్సు సౌకర్య కల్పించండి అని పలువురు మొర పెట్టుకుంటున్నా.. పట్టించుకునే వారు కరవయ్యారు. రాష్ట్రంలో 3 వేల 669 గ్రామాలకు ఆర్టీసీ సేవలు లేవు. దీన్ని బట్టే ముఖ్యమంత్రి జగన్‌ ఏలుబడిలో ఆర్టీసీ రథచక్రాలు ఏవిధంగా కుంటుపడ్డాయో అర్థం చేసుకోవచ్చు.

NO_RTC_Bus_Facility_for_Villages_in_AP
NO_RTC_Bus_Facility_for_Villages_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2023, 8:38 AM IST

NO RTC Bus Facility for Villages in AP: పల్లెలకు దూరంగా ప్రగతి రథచక్రాలు.. వైసీపీ ప్రభుత్వ పుణ్యమా అని ప్రజారవాణా సేవలకు నోచుకోని గ్రామాలు..

NO RTC Bus Facility for Villages in AP: గ్రామాల్లో ఉండే ప్రజలు నిత్యం తమ అవసరాల కోసం సమీప పట్టణాలు, మండల, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాలంటే ఎక్కువగా అర్టీసీనే ఆశ్రయిస్తారు. సురక్షిత ప్రయాణం, ప్రైవేటు వాహనాలతో పోల్చితే తక్కువ ఛార్జీల కారణంగా.. ఎక్కువగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలకే మొగ్గు చూపుతారు. కానీ, ఏపీఎస్​ఆర్టీసీ మాత్రం అన్ని పల్లెలకు బస్సులు నడిపేందుకు మొగ్గుచూపడంలేదు. గిట్టుబాటు కాదని, రూట్ కనెక్టివిటీ ఇవ్వలేమని.. ఇలా రకరకాల కారణాలతో పలు గ్రామాలకు బస్సులు నడపడంపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది.

ఏపీఏస్​ఆర్టీసీ నిత్యం 3 వేల 510 రూట్లలో బస్సులు నడుపుతుండగా.. ఇవి 14 వేల 213 గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అయినా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఆర్టీసీ బస్సులు తిరగని గ్రామాలు 3 వేల 669 ఉన్నాయి. మా ఊళ్లకు బస్సు నడపండి మహాప్రభో అంటూ ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వేడుకున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడంలేదు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే.. పరిశీలిస్తామని హామీ ఇచ్చి, తర్వాత దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు.

How to Apply TSRTC Student Bus Pass : ఆన్​లైన్​లో బస్​పాస్​.. ఇంటి నుంచే పొందండిలా..!

జగన్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో బస్సుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. అత్యధిక కిలోమీటర్లు తిరిగి కాలంచెల్లిన బస్సుల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేయడంలేదు. దీంతో గత నాలుగేళ్లలో ఏసీ మినహా, మిగిలిన అన్ని రకాల సర్వీసులు సంఖ్య తగ్గిపోయింది. ఆర్టీసీలో 2019లో మొత్తం బస్సుల సంఖ్య 11 వేల 770 కాగా.. వైసీపీ అధికారంలో ఉన్న గత నాలుగేళ్లలో 866 బస్సులు తగ్గి 10 వేల904కి చేరింది.

సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ ప్రెస్ వంటి నాన్ ఏసీ బస్సులు 4 వేల 439 ఉండగా.. ప్రస్తుతం 568 బస్సులు తగ్గిపోవడంతో 3 వేల 871 మాత్రమే నడుపుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నడిపే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సిటీ బస్సుల సంఖ్య 13వందల 43 నుంచి వెయ్యి 67కి చేరింది. అంటే నాలుగేళ్లలో 276 సర్వీసులు తగ్గిపోయాయి. గ్రామీణుల ప్రయాణించే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు 5 వేల648 నుంచి 5 వేల504 సర్వీసులకు తగ్గాయి. ఈ లెక్కన పల్లె బస్సుల్లో 144 కనుమరుగయ్యాయి. గత నాలుగేళ్లలో కేవలం ఏసీ సర్వీసులు మాత్రమే పెరిగాయి. 2019లో 340 ఏసీ సర్వీసులు నడపగా.. ప్రస్తుతం 462 బస్సులు ఉన్నాయి.

RTC Contract Employees Agitation In Vijayawada: హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు: ఆర్టీసీ ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు

'అంటరానితనమంటే ఫలానా వ్యక్తులు కేవలం కొందరు భౌతికంగా ముట్టుకోవటానికి వీళ్లేదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం. రూపం మార్చుకున్న అంటరానితనంలో.. పలు రూపాల్లో ఉన్నా ఈ పెత్తందారి భావజాలం మీద యుద్ధం చేస్తున్న ప్రభుత్వం మనది.' ఆగస్ట్‌ 15 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం జగన్ అంటరానితనానికి, బస్సులకు లంకెపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి.

ఆర్టీసీ బస్సులు ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం అంటరానితనం అన్నారు సరే.. మరి మీ పాలనలోనే రాష్ట్రంలోని పల్లెలన్నింటికీ పూర్తిస్థాయిలో బస్సుల్లేకుండా చేయడాన్ని ఏమంటారు జగన్. ఇది పేదల పక్షపాత ప్రభుత్వమని, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ.. అంటూ ప్రతి ప్రసంగంలో వారిపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తుంటారే.. మరి అదే పేదలు, రైతులు, కులవృత్తులు చేసుకునేవాళ్లు, అన్నివర్గాల గ్రామీణులు అత్యధికంగా ఉండే గ్రామాలన్నింటికీ ఆర్టీసీ బస్సులను ఎందుకు నడపలేకపోతున్నారు.

GOVT TALKS WITH APSRTC UNIONS: విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులు అష్టకష్టాలు..పట్టించుకోని ఉన్నతాధికారులు

రాష్ట్రంలో 3 వేల 669 గ్రామాలకు అసలు బస్సులే నడపకుండా, ఆటోల్లోనో, ప్రైవేటు వాహనాల్లోనో మీ పాట్లు మీరు పడండి అని పేదల ప్రజల్ని వదిలేయడమేనా వారిపై ప్రేమంటే? ఆటోలు, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు అడిగినంత ఛార్జీ చెల్లించేందుకు గ్రామీణులు పడుతున్న ఇక్కట్లు మీకు కనిపించవా? బస్సుల్లేకపోవడంతో ఆయా గ్రామాలకు సామర్థ్యానికి మించి 10-15 మందిని ఎక్కించుకొని ప్రయాణించే ఆటోలు.. అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై గుంతలు తప్పించుకొని వెళ్లే ప్రయత్నంలో తరచూ ప్రమాదాలకు గురికావడం మీకు తెలియదా. నాలుగేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి, ప్రయాణికులపై ఏటా 2 వేల కోట్ల రూపాయల మేర భారం వేయడంపై ఉన్న శ్రద్ధ పల్లెలకు బస్సులను పరుగులు పెట్టించడంపై ఎందుకు లేదో సీఎం సారే చెప్పాలి.

No Buses to TDP Mahanadu: అధికార పార్టీకేమో అడిగినన్ని.. మహానాడుకు మాత్రం తాత్సారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.