మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ఇంట్లో జరిగిన దొంగతనానికి తనకు ఎలాంటి సంబంధం లేదని సత్తెనపల్లి శాససనభ్యులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కోడెల ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తి ఎవరో తెలియదన్నారు. సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన నైపుణ్య కేంద్రంలో 30 కంప్యూటర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కంప్యూటర్లు మాయంపై ఈనెల 9న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీకి లేఖ రాశానని తెలిపారు. దీనిపై విచారణ జరగుతున్న సమయంలోనే అతిథి గృహంలో 30 కంప్యూటర్లు ఎలా ప్రత్యక్షమయ్యాయని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న కోడెలపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు.
ఇదీచదవండి
మళ్లీ తెరపైకి ఫోక్స్‌వ్యాగన్ కేసు... మంత్రి బొత్సకు సమన్లు...