No Confidence Motion: గుంటూరు జిల్లా ఏపీఎన్జీవో కార్యవర్గంలో విభేదాలు పొడచూపాయి. ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించిన పోటీ వర్గం ప్రతినిధులు.. అధ్యక్షుడిగా ఉన్న రామిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మెజార్టీ సభ్యులు రామిరెడ్డికి వ్యతిరేకంగా ఓటేయటంతో ఆయన పదవి నుంచి వైదొలిగారు.
అదే సమయంలో ఇప్పటి వరకు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఘంటసాల శ్రీనివాసరావును.. నూతన అధ్యక్షుడిగా ఎనుకున్నారు. సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న సతీశ్‌ను జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
ఏపీఎన్జీవో సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడతామని స్పష్టం చేశారు. పీఆర్‌సీ నివేదికను వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి