ETV Bharat / state

వేటకు బయలుదేరిన నిజాంపట్నం హార్బర్ మత్స్యకారులు

సముద్రపు వేట వాళ్లకు జీవనాధారం. అది లేనిదే పూటైనా గడవదు. అలాంటిది.. ఈ మహమ్మారి కరోనాతో ఇన్ని రోజులు కడలిలో కాళ్లు మోపడానికి వీలు లేకుండా పోయింది. చివరకు ప్రభుత్వం అనుమతితో వేటకు వెళ్లేందుకు బయలుదేరారు. ఇదీ నిజాంపట్నం హార్బర్ వద్ద మత్స్యకారుల ధీనగాథ.

fish hunting starts in guntur
వేటకు బయలుదేరిన మత్స్యకారులు
author img

By

Published : Jun 17, 2020, 7:46 PM IST

45 రోజుల వేట నిషేధం తర్వాత గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద మత్స్యకారులు వేటకు బయలుదేరారు. మత్స్య సంపద పునరుత్పత్తికి ఏప్రిల్ 16 నుంచి వేట నిషేధం విధించిన ప్రభుత్వం...ఈ నెల 1 నుంచి వేటకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీనివల్ల ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల మత్స్యకారులు వేట ప్రారంభించారు.

ప్రతి ఏటా నిజాంపట్నం గ్రామ దేవత మొగదారమ్మ తల్లి శిరిమాను ఉత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. అనంతరం శుభ ముహూర్తం చూసుకొని వేటకు బయలుదేరుతారు. కరోనా ప్రభావంతో ఈ ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించి... అమ్మవారికి పూజలు చేసి వేటకు బయలు దేరారు. విరామ సమయంలో యజమానులు బోట్లకు మరమ్మతులు చేయించి...వాటిని వేటకు సిద్ధం చేస్తారు. ఒక్కసారి బోటును వేటకు పంపేందుకు రూ. 2 లక్షలు నుంచి రూ. 3 లక్షల ఖర్చు అవుతుందని యజమానులు చెబుతున్నారు.

వేట నిషేధ సమయం ముందు... కరోనా ప్రభావంతో నెల రోజులు వేట లేకుండా పోయిందని, పట్టిన సరుకును ఎగుమతి చేయలేక తీవ్ర ఇబ్బందులు పడినట్లు మత్స్యకారులు వాపోయారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతితో తిరిగి వేటకు బయలుదేరామన్నారు. ఈసారైనా సరుకు ఎగుమతుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ జీవనోపాధి సజావుగా సాగుతోందని కడలి పుత్రులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజాంపట్నం హార్బర్​లో సుమారు 200 పెద్ద బోట్లు, 500 ఫైబర్ బోట్లు ఉన్నాయి. దీనిపై ఆధారపడి సుమారు 15 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు.

ఇదీ చూడండి:ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్....మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.