వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన చేస్తోందని.. ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన గృహంలో తెదేపా కార్యకర్తలు నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన హాజరయ్యారు. కేక్ కోసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2020వ సంవత్సరం ప్రతి ఒక్కరినీ కష్టాలలోకి నెట్టిందని... 2021లో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ఉన్న వైకాపా ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేసే మంచి మనసు కలగాలని ఆకాంక్షించారు. వేడుకల్లో ఎమ్మెల్సీ ఏఎస్. రామకృష్ణ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి:
వైకాపా నేత దాడిలో గాయపడ్డిన వ్యక్తిని పరామర్శించిన మాజీ మంత్రి