కరోనా మహమ్మారి తాండవిస్తున్న తరుణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారు. మాస్కులు ధరించకుండా నిత్యావసరాలు కోసం వచ్చిన ఆరుగురికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ఇకనుంచి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధించారు. పట్టణంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రతిఒక్కరూ సహకరించాలని వెంకటేశ్వరరావు కోరారు.
కరోనా నియంత్రణకు కొత్త నిబంధనలు..! - guntur narasarao peta latest news
గుంటూరు జిల్లాలో కరోనా నియంత్రణకు భాగంగా అధికారులు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. నరసరావుపేటలో మాస్కులు లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నారు. పట్టణంలో కరోనా మహమ్మారి తాండవిస్తున్న తరుణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

కొత్త నిబంధనలు వెల్లడిస్తున్న నరసరావుపేట మున్సిపల్ కమిషనర్