జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు అధికంగా ఉన్న జిల్లాల్లో గుంటూరు 2వ స్థానంలో ఉంది. కొత్తగా 195 కరోనా కేసులు నమోదు కాగా.. మెుత్తం కేసుల సంఖ్య 71వేల 336కు చేరింది. వైరస్ బారినపడి ఒకరు మృతి చెందగా... మెుత్తం మరణాల సంఖ్య 634కు చేరింది. వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకు 67,011 మంది ఇంటికి చేరుకున్నట్లు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థలో 38 కేసులు నమోదయ్యాయి. తెనాలి-19, తుళ్లూరు-14, బాపట్ల-12, కొల్లిపర-8, మంగళగిరి-6, పెదకాకాని-5, ప్రత్తిపాడు-5, సత్తెనపల్లి-5, కొల్లూరు-5 చొప్పన కేసులు నమోదయ్యాయి.
తాజాగా వచ్చిన కేసుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నుంచి నమోదు అయినవే. పాఠశాలలు ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థులు, టీచర్ల ఎక్కువగా వైరస్ బారినపడినట్లు సమాచారం. సీఎం జగన్ చేపట్టిన పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు కరోనా నిబంధనలు మరచిపోయి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పలువురు అంటున్నారు. ఇవే వైరస్ వ్యాప్తికి ప్రత్యక్షం, పరోక్షంగానూ కారణమని చెబుతున్నారు.
ఇదీ చూడండి: