గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు అలరించాయి. ఉగాది పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీలను ప్రారంభించారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతిని రక్షించేందుకు ఈ పోటీలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
ఒంగోలు జాతి వృషభరాజముల ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతోనే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వారు అంటున్నారు. నేటి నుంచి ఈ నెల 13 వరకు పోటీలు కొనసాగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు రైతన్నలు తమ వృషభాలతో తరలివచ్చారు. ఏపీ, తెలంగాణ నుంచి తొలిరోజు పోటీలో 16 జట్లు పాల్గొంటున్నాయి.
ఇదీ చదవండీ... తిరుపతి ఉపపోరు: ఓటర్ల కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు