అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి ప్రతీప్ కుమార్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గుంటూరు అటవీ శాఖ కార్యాలయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 22 మంది అమరువీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇందుకోసం స్పెషల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నామన్నారు.
ఇదీ చదవండి
CM Jagan: వారంలో బాషా సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశం