గుంటూరు జిల్లా నరసరావుపేట మీదుగా చలో ఆత్మకూరుకు భారీ స్థాయిలో తరులుతున్నట్టు నరసారావు పేట తెదేపా నాయకుడు చదలవాడ అరవిందబాబు తెలిపారు. వైకాపా దాడులతో గ్రామాలు వదిలి వెళ్లిన తెదేపా కార్యకర్తలకు అండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన చలో ఆత్మకూరుకు మద్దతుగా వెళ్తున్నట్టు చెప్పారు. నరసరావుపేట నుంచి 1000 ద్విచక్ర వాహనాలు, 200 కార్లతో..చలో ఆత్మకూరు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆత్మకూరు వెళ్లి తీరుతామన్నారు. సుమారు 400 మంది వైకాపా బాధితులు గుంటూరు పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్నారన్నారు. ప్రజలు అధికారమిస్తే వైకాపా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: