ఆర్ఎంపీలను ప్రభుత్వం ఆదుకోవాలని నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు. వైకాపా ప్రభుత్వం త్వరలో విలేజ్ క్లినిక్లను ప్రవేశపెట్టి ఆర్ఎంపీల పొట్టకొట్టాలని చూస్తోందని నరసరావుపేట తెదేపా కార్యాలయంలో ఆరోపించారు. తరతరాల నుంచి గ్రామాలను నమ్ముకొని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఆర్ఎంపీలు వైద్యవృత్తిలో కొనసాగుతున్నారన్నారు. వారందరికీ అన్యాయం జరిగేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం విలేజ్ క్లినిక్ల ఆలోచన చేయడం సరికాదని అరవిందబాబు పేర్కొన్నారు.
అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉండేదన్న ఆయన.. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని నిలిపివేసిందన్నారు. అందువల్ల పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని గుర్తించి ఆరోగ్యశ్రీలో మోకాళ్ళ ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని అరవింద బాబు కోరారు.
ఇవీ చూడండి...: జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు