గుంటూరు జిల్లా నర్సరావుపేట పరిధిలో దాదాపు 15 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల స్థలాల పంపిణీ చేపడుతోందని.. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరైనా ఇళ్లస్థలాలకు లంచమడిగితే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
కొందరు వాలంటీర్లు ఇళ్ల స్థలాలకు లంచాలు తీసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని వారిపై చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరైనా అర్హులు ఇళ్లస్థలాలకు నమోదు చేసుకొని వారికి అందకపోతే అలాంటి వారు జులై 8 తర్వాత కూడా పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు. వారికి 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...