ETV Bharat / state

Nara Lokesh Yuvagalam padayatra in Mangalagiri: జన మంగళగిరి.. అట్టహాసంగా లోకేశ్‌ యువగళం పాదయాత్ర - nara lokesh fires on cm jagan

Nara Lokesh Yuvagalam padayatra in Mangalagiri: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అట్టహాసంగా సాగింది. భారీ జనసందోహం వెంటరాగా లోకేశ్‌ ముందుకుసాగారు. 'మన మంగళగిరి.. మన లోకేశ్‌' అనే నినాదాలతో భారీ కటౌట్లు.. అడుగడుగునా స్వాగత ప్లెక్సీలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైసీపీ పాలనలో పడుతున్న ఇబ్బందుల్ని వివిధ వర్గాల ప్రజలు.. లోకేశ్​ను కలిసి వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సమస్యల పరిష్కారంతోపాటు భవిష్యత్తుకు బాటలు వేస్తామని లోకేశ్‌ భరోసా కల్పిస్తూ ముందుకు కదిలారు.

Yuvagalam_padayatra_in_Mangalagiri
Nara_Lokesh_Yuvagalam_padayatra_in_Mangalagiri
author img

By

Published : Aug 16, 2023, 10:11 AM IST

Nara_Lokesh_Yuvagalam_padayatra_in_Mangalagiri: మంగళగిరిలో నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర

Nara Lokesh Yuvagalam padayatra in Mangalagiri: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర 185వ రోజు.. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి మంగళగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇక్కడ లోకేశ్​.. తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా ఉండటంతో స్థానిక నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. నిడమర్రు నుంచి యాత్ర ప్రారంభించిన లోకేశ్​.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాతో ప్రీడమ్‌ వాక్‌లో పాల్గొన్నారు. నిడమర్రులో లోకేశ్‌కు పసుపు కొమ్ముల దండతో స్వాగతం పలికిన రైతులు.. తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.

Sarpanches Met Nara Lokesh: హక్కుల కోసం పోరాడే సర్పంచులకు పూర్తి మద్దతుగా ఉంటాం: లోకేశ్​

Turmeric Farmers Met Nara Lokesh: నాణ్యమైన విత్తనం, గిట్టుబాటు ధర లేక పసుపు రైతులు నష్టపోతున్న విషయాన్ని వివరించారు. దీనిపై స్పందించిన లోకేశ్​.. రైతులకు అవసరమైన విత్తనం కూడా సరఫరా చేయలేకపోవడం వైసీపీ ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులు కోరుకుంటున్నట్లు సేలం రకం విత్తనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. మంగళగిరికి చెందిన మహిళలు లోకేశ్​కు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

Nara Lokesh Meeting with Auditors: కక్షసాధింపులు చేస్తే కంపెనీలు రావు! రాజకీయం వేరు.. వ్యాపారం వేరు!: లోకేశ్

Mangalagiri Women Met Lokesh: జగన్‌ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని లోకేశ్​ ఆరోపించారు. నాలుగు సంవత్సరాలలో మహిళలపై 52వేల 587 నేరాలు జరిగినట్లు తెలిపారు. మంగళగిరి పాత బస్టాండు వద్ద ముస్లిం మైనార్టీలు తమ సమస్యలను విన్నవించారు. కృష్ణ బలిజసంఘం ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి వారిని బీసీ-డీ విభాగంలో చేర్చడం వల్ల నష్టపోతున్న వైనాన్ని వివరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరించి కృష్ణబలిజల ఆర్థిక స్వాలంబన కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Nara Lokesh Meet Amaravati Farmers: 'అమరావతి రైతుల త్యాగం వృథా కాదు.. మరో 9 నెలలు ఓపికపడితే చాలు..: నారా లోకేశ్

Grand Welcome to Lokesh in Mangalagiri: లోకేశ్‌ పాదయాత్రకు మంగళగిరిలో అపూర్వ స్పందన లభించింది. నిడమర్రు రోడ్డు నుంచి మంగళగిరిలోకి ప్రవేశించగానే గజమాలలు, కళాకారుల బృందాలతో.. స్వాగతం పలికారు. రైల్వేగేటు సమీపంలో రహదారికి ఇరువైపులా భారీ L.E.Dతెరలు ఏర్పాటు చేశారు. మంగళగిరిలో లోకేశ్‌ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల వివరాల్ని ప్రదర్శించారు. చేనేతకు ప్రసిద్ధి అయిన మంగళగిరిలో ఆవర్గం వారు ఆత్మీయ స్వాగతం పలికారు. పట్టుదారాలతో రూపొందించిన గజమాలతో లోకేశ్‌ను అలంకరించడం ప్రత్యేకంగా కనిపించింది.

Nara Lokesh Pawan Kalyan Flexies: యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం.. ఒకే ఫ్లెక్సీలో నారా లోకేశ్, పవన్ కల్యాణ్!

Lokesh Selfie: పాదయాత్రలో భాగంగా ఏపీఐఐసీ భవనం, టిడ్కో గృహాలు, అమృత యూనివర్శిటి భవనాల సమీపంలో లోకేశ్​ సెల్ఫీలు దిగారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు జలధార వాటర్ ట్యాంకర్లు, వైద్యసేవలకు ఆరోగ్య రథాలు, ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు, చిరువ్యాపారులకు తోపుడుబళ్లు, చేనేతలకు రాట్నాలు, స్వర్ణకారులకు పనిముట్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, పాదచారులు సేదదీరేందుకు సిమెంటు బల్లలు.. ఇలాంటి 27 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నానని తెలిపారు.

Nara Lokesh Yuvagalam padayatra: 'సైకో పోవాలి సైకిల్‌ రావాలి'.. గురజాల నియోజకవర్గంలో దుమ్మురేపిన లోకేశ్ పాదయాత్ర..

Lokesh Fires on CM Jagan: లోకేశ్​ అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన నమూనాల వద్ద సెల్ఫీ దిగారు. అధికారం చేపట్టిన నాలుగేళ్లలో 100 సంక్షేమ పథకాలను రద్దు చేయటం, అన్న క్యాంటీన్లు తీసేయటం, బుల్డోజర్లతో పేదల గూళ్లను కూల్చేయటం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. చేసిన పాపాలు కప్పిపుచ్చుకోవడానికి ప్యాలస్ నుంచి బయటకు రావాలంటే వందలాది పోలీసులు, కిలోమీటర్ల పొడవున పరదాలు కట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Lokesh Fire on MLA Kasu Mahesh in Piduguralla Meeting: కొన్ని నెలలు ఓపిక పట్టండి.. క్యాష్ మహేష్​ను పిల్లి మహేష్​ చేస్తాం: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.