ETV Bharat / state

విజిలెన్స్‌ దాడులు ఆపకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం: లోకేశ్

author img

By

Published : Jan 21, 2021, 6:28 PM IST

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే గుంటూరు జిల్లా మంగళగిరిలోని చేనేత సొసైటీలపై విజిలెన్స్‌ దాడులు జరుగుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చేనేత కళను ఏళ్ల తరబడి కాపాడుతూ వస్తున్న సొసైటీలపై వరుస దాడులు ఆపాలంటూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

మంత్రి గౌతమ్ రెడ్డికి లోకేశ్ లేఖ
మంత్రి గౌతమ్ రెడ్డికి లోకేశ్ లేఖ

గుంటూరు జిల్లా మంగళగిరిలోని చేనేత సొసైటీలపై విజిలెన్స్‌ దాడులు ఆపాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. చేనేత కళను ఏళ్ల తరబడి కాపాడుతూ వస్తున్న సొసైటీలపై వరుస దాడులు బాధాకరమంటూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి లేఖ రాశారు. విజిలెన్స్‌ దాడులు తక్షణమే ఆపకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

'దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న మంగళగిరి చేనేత తీవ్ర సంక్షోభంలో ఉంది. కరోనా దెబ్బకి నేతన్నల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఉపాధి లేక చేనేతలు పస్తులుంటున్న సమయంలో రాజకీయ కక్షతో సొసైటీలపై దాడులు చేయించటం దారుణం. ఇలాంటి విష సంస్కృతి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది' అని మంత్రి గౌతమ్ రెడ్డికి రాసిన లేఖలో లోకేశ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి

కిరణ్‌ మృతిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.