రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రెడ్జోన్లో ఉన్న ఓ మహిళ ఆవేదనకు సంబంధించిన వీడియోను లోకేశ్ విడుదల చేశారు.
ఆ మహిళ సంధించే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలూ కల్పించకుండా ప్రజల్ని వేధించడం హేయమని అన్నారు. అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ప్రజలతో కర్కశంగా వ్యవహరించడం మానాలన్నారు.
ఇదీ చదవండి:
లాక్డౌన్లో టికెట్లు తీసుకున్న ఆర్టీసీ ప్రయాణికులకు నగదు వాపస్