LOKESH ON TEACHERS : ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా అంటూ.. నారా లోకేశ్ ప్రశ్నించారు. ఉపాధ్యాయులను ఎన్నికలు విధుల నుంచి దూరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకు, మరుగు దొడ్ల ఫోటోలు తియడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా అంటూ నిలదీశారు.
-
ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా? ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి, మరుగుదొడ్ల ఫోటోలు తియ్యడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/OB6zvCLDbC
— Lokesh Nara (@naralokesh) November 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా? ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి, మరుగుదొడ్ల ఫోటోలు తియ్యడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/OB6zvCLDbC
— Lokesh Nara (@naralokesh) November 30, 2022ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా? ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి, మరుగుదొడ్ల ఫోటోలు తియ్యడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/OB6zvCLDbC
— Lokesh Nara (@naralokesh) November 30, 2022
ఇదీ జరిగింది: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకుండా.. విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధుల నుంచి తప్పించింది. విద్యేతర పనులకు ప్రభుత్వశాఖల్లోని సిబ్బంది అందరినీ వినియోగించిన తర్వాత అవసరం ఉందనుకుంటేనే ఉపాధ్యాయులకు విధులను అప్పగించాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
విద్యా హక్కు చట్టం నియమాలు-2010ని సవరించేందుకు ప్రభుత్వం సోమవారం మంత్రులకు హడావుడిగా ఈ-ఫైల్ పంపించి సంతకాలు తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 27 ప్రకారం జనాభా గణన, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన విధులు మినహా విద్యేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించకూడదు. అయితే సెక్షన్-27లోని నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకు సవరణలను తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ చదవండి: