రాజధాని మార్పు అంశం న్యాయస్థానాల్లో నిలబడదని తెలిసే ప్రాంతాలు, కులాలు మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. రాజధాని వికేంద్రీకరణకు నిరసగా గత 298 రోజులుగా ఉద్యమం కొనసాగుతోందన్నారు. అమరావతి ఉద్యమం ఒక చారిత్రాత్మకం ఘట్టమని.. మూడు వందల రోజులు పాటు ఉద్యమం జరగడం ఓ చరిత్ర అని అన్నారు.
అమరావతి రైతుల డ్రెస్ కోడ్ పై వైకాపా నేతలు వ్యాఖ్యలు చేయడం దారుణమని నక్కా ఆనంద్ బాబు అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావంగా నేడు, రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాలలో నిరసన దీక్షలు చేపడతమన్నారు. అన్ని నియోజవర్గాలలోని మహనీయుల విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసనలు తెలుపుతామని.. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి పౌరుడు పాల్గొనాలని నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: సేవను సరిహద్దులు దాటించిన తెలుగు తేజాలు.!