గుంటూరు ఏటీ అగ్రహారంలో వ్యభిచార గృహంపై నగరం పాలెం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు విటులు, ఓ మహిళను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు. శ్రీలక్ష్మి అనే మహిళా ఓ నివాసాన్ని అద్దెకు తీసుకొని.. అందులో శ్రీ లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ పేరుతో.. ఎవరికి అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకురాలు శ్రీలక్ష్మి వాట్సాప్ ద్వారా విటులకు మహిళల ఫొటోలు పంపి.. వ్యభిచారం నిర్వహిస్తునట్లు వెల్లడించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలు శ్రీలక్ష్మితో పాటు.. విటులు పేరం సుబ్బారెడ్డి, పట్టపురాజు శ్రీనివాసులు, పెద్దింటి రమేష్‌ను అరెస్ట్ చేసి.. వారి నుంచి ఐదు వేల రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకునట్లు వివరించారు.
ఇవీ చూడండి...