ETV Bharat / state

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం.. బ్యాంకులు సైతం అప్పులివ్వటం లేదు: నాదెండ్ల

Nadendla On AP Financial Status: ప్రజలు ఎంతో నమ్మకంతో 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి అధికారంలో కూర్చొబెడితే.. సీఎం జగన్ వారిని మోసం చేశారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని.., ప్రభుత్వానికి బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం
author img

By

Published : Feb 17, 2022, 4:51 PM IST

Nadendla Comments On AP Financial Status: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వానికి బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. పరిపాలనలో మంత్రులకు ప్రాధాన్యం లేదని.. సకలశాఖల మంత్రే అన్నీతానై నడిపిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జలను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.

గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో అనధికార కరెంటు కోతలు అమలు చేస్తున్నారన్నారు. భవిష్యత్​లో ఇంకా కోతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులపై విధించిన ట్రూ అప్ ఛార్జీలను వేరే రూపంలో తెచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రజలు ఎంతో నమ్మకంతో వైకాపాకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి అధికారంలో కూర్చొబెడితే.. సీఎం జగన్ వారిని మోసం చేశారన్నారు. కనీసం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోవటంతో వారు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి ఉంటే వైకాపా ప్రజాప్రతినిధులు ఉండే వారు కాదని అన్నారు. జనసేన బలోపేతంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని.., అందరూ కలిసి పనిచేస్తే ఈసారి జనసేనదే అధికారమని నాదెండ్ల మనోహర్ విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

ఇదీ చదవండి

కేంద్రం సహకారంతో.. రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు మార్చేస్తాం: జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.