గుంటూరు జిల్లాలో దొంగలముఠాలో ఏర్పడిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. కర్లపాలెం మండలం సత్యవతి పేటకు చెందిన సాగర్ రెడ్డిని ఇవాళ సాయంత్రం కొందరు కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
అతని స్నేహితులే సాగర్ రెడ్డిని చంపినట్లు పోలీసులు తెలిపారు. సాగర్ రెడ్డి దొంగతనాలు, గంజాయి రవాణాతో పాటు నేరాలకు పాల్పడుతుంటాడు. అతనిపై గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. దొంగసొత్తు పంపకాల్లో అదే ముఠాలోని బడేసాబ్ అనే వ్యక్తితో సాగర్ రెడ్డికి విభేదాలు వచ్చాయి. దీంతో బడేసాబ్ మరికొందరితో కలిసి సాగర్ను హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. మొత్తం 8మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: అనుమతి తీసుకోకపోవడం వల్లే గృహనిర్బంధం: హోం మంత్రి సుచరిత