గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో దారుణం జరిగింది. వరుసకు సోదరుడు అయ్యే తిరుమలశెట్టి నాగరాజును... మహేష్ అనే వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంత కాలం నుంచి నాగరాజుకు అతని కుటుంబసభ్యులకు మధ్య వివాదం ఉన్నట్టు గుర్తించారు.
కొలకలూరు సెంటర్లో నాగరాజుపై మహేష్ కత్తితో దాడి చేసి విచక్షణ రహితంగా గాయపరిచాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని స్థానికులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దారిలోనే నాగరాజు మృతి చెందాడు.
ఇదీ చదవండి:
గ్రామానికి గ్రామం నీట మునక... కనుచూపు మేరలో ఎటు చూసినా వరదే!