కోటయ్య హత్యకేసులో అరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా అమర్తలూరుకు చెందిన పామిడిపాటి కోటయ్య, తెనాలికి చెందిన శుద్ధపల్లి నాగరాజు ఒకే సంఘంలో పనిచేశారు. కోటయ్య సంఘం నుంచి బయటికి వచ్చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. కోటయ్య తనను ఏమైనా చేస్తాడేమో అనే భయం నాగరాజులో మొదలైంది. తొలుత కోటయ్యనే హతమార్చాలని పధకం రచించాడు. ఈనెల 5వ తేదీన కోటయ్య గుంటూరు నుంచి తెనాలి వెళుతున్నాడని తెలుసుకున్నాడు. ఆరుగురితో కలిసి చేబ్రోలు మండలం వేజెండ్ల అడ్డరోడ్డు వద్ద కారుతో అడ్డగించి దాడి చేశాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా... అప్పటికే కోటయ్య మృతిచెందినట్టు వైద్యులు నిర్ధరించారు. చేబ్రోలు ఎస్సై కిశోర్ కేసు దర్యాప్తు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.
ఇదీ చదవండి... అన్న క్యాంటీన్లు తెరవాలని... అఖిలపక్షం దీక్ష