గుంటూరు జిల్లాలో పురపాలక ఎన్నికలో పోటీకి నామినేషన్లు దాఖలు చేసిన వారిలో నలుగురు చనిపోయారు. గుర్తింపు పొందిన లేదా రిజిస్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరైనా మరణిస్తే ఆ స్థానాల్లో ఎన్నికలు వాయిదా వేస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నిల సంఘం ప్రకటించింది. ఈమేరకు జిల్లాలోని ఎన్నికల జరుగుతున్న పట్టణాల్లో చనిపోయిన అభ్యర్థుల వివరాలను మున్సిపల్ వర్గాలు సేకరించాయి. గుంటూరు నగరపాలకలో ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్థులు చనిపోయినట్లు నగరపాలక ధ్రువీకరించింది. అదేవిధంగా చిలకలూరిపేట, రేపల్లె, పురపాలికల్లో ఒక్కొక్కరో చొప్పున ఇద్దరు మృత్యవాత పడ్డారు. వీరంతా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారమిచ్చారు.
ఇదీ చదవండి: మహాశివరాత్రి వేడుకలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష