ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి, అర్హులు, అనర్హులను గుర్తించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ.. వీఆర్వోలను ఆదేశించారు. స్థానిక యాదవ బజార్లోని శ్రీ కృష్ణ కళ్యాణ మండపంలో.. వీఆర్వోలతో ఇళ్ల పట్టాల దరఖాస్తులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
గతేడాది నవంబర్ 25 తర్వాత అందిన దరఖాస్తులను డోర్ టు డోర్ ప్రత్యక్షంగా పరిశీలించి ఆన్లైన్ చేయాలని, దరఖాస్తుని నగరపాలక సంస్థలో అందించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 66 వేల మందికి ఇళ్ల పట్టాలు చేశామని.. అయినా ఇంటి స్థలం కావాలని దరఖాస్తులు అందుతుండటంతో.. దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలన్నారు.
అర్హుల, అనర్హుల జాబితాలో లోపాలు తలెత్తినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. సంబంధిత వీఆర్వోలదే బాధ్యత అని కమిషనర్ స్పష్టం చేశారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన సచివాలయాల్లో.. ప్రతి రోజు కార్యదర్శుల పనితీరుని తనిఖీ చేయాలని, ఇళ్ల స్థల దరఖాస్తులను నోడల్ అధికారి సంతకంతోనే అప్లోడ్ చేయాలన్నారు. ఇళ్ల స్థలాల దరఖాస్తుల పరిశీలన వేగవంతం కోసం సీనియర్ అధికారులను కేటాయిస్తామని అనురాధ తెలిపారు.
ఇదీ చదవండి: సర్పంచి రాలేదని ఆమె భర్తతో ప్రమాణస్వీకారం