అనంతపురంలోని రాంనగర్లో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్న మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు... ఆ కట్టడాల కూల్చివేతకు చర్యలు చేపట్టారు. అవినీతి అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక కమిషనర్ మూర్తి చెప్పారు. లంచం తీసుకున్న, ఇచ్చిన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు నడుచుకోవాలని పేర్కొన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నందున కోర్టు నుంచి నోటీసులు జారీ చేశారని అధికారులు చెబుతున్నారు.
మామూలు కోసమే...!
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే కట్టడాలు చేపడుతున్నామని అపార్టమెంట్ కన్స్ట్రక్షన్స్ అధినేత త్రివేణి నాయుడు తెలిపారు. మామూలు ఇవ్వకపోవడం వల్లే ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఉన్న కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులందరికీ మామూలు ఇచ్చారని.. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలు మారడం వల్ల ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి