
గుంటూరు జిల్లా మాచర్లలోని గడియారం స్తంభం నేలమట్టమైంది. పట్టణంలో పాత ఊరికి.. కొత్తగా విస్తరించిన ప్రాంతాలకు మధ్యలో ఆ స్తంభం ఒక గుర్తుగా ఉండేది. దాదాపు 35 నుంచి 40 అడుగుల ఎత్తులో ఉండే గడియారస్తంభాన్ని.. పురపాలక అధికారులు ఇప్పుడు కూల్చేశారు. ఆ సమయంలో స్తంభాన్ని చూస్తూ వృద్ధులు పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. నూతనంగా మరో గడియారం స్తంభం నిర్మించాలనే ప్రతిపాదన ఉంది.

ఇదీ చదవండి: