దేశంలోనే తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ (mp mopidevi venkata ramana news) అన్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ (nizampatnam harbour news)ను ఆయన పరిశీలించారు. పోర్టు అభివృద్ధి కోసం భూసేకరణపై అధికారులతో మోపిదేవి చర్చించారు. సుమారు 450 కోట్ల రూపాయలతో హార్బర్ అభివృద్ధికి పనులు చేపట్టనున్నట్లు మోపిదేవి తెలిపారు.
రాష్ట్రంలో విశాఖ తరువాత..అధికంగా మత్స్య సంపద ఉత్పత్తి నిజాంపట్నంలోనే జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో అతి ప్రధానమైన హార్బర్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. బోట్లు నిలుపుకునేందు జెట్టి సామర్థ్యం పెంచడం, పరిపాలన కార్యాలయాలు, శీతల గిడ్డంగులు, విశ్రాంతి భవనాలు, బోట్ల మరమ్మతులు, మురుగు కాల్వలు వంటి వాటి విషయంలో మౌలిక వసతుల కల్పన జరుగుతుందని చెప్పారు.
ఇదీ చదవండి
TS letter to GRMB: ఆ ప్రాజెక్టులపై ఏపీ అభిప్రాయం అక్కర్లేదు.. గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ