ETV Bharat / state

మత్తులో మద్యం తరలిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు..! - Firangipuram latest news

అసలే మత్తులో ఉన్నారు. ఆపై అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. ఏమైందో ఏమో ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరొకరు గాయపడ్డారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

Moved alcohol intoxicated and brought to life ..!
మత్తులో మద్యం తరలిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు..!
author img

By

Published : Aug 2, 2020, 11:01 PM IST

గుంటూరులోని అమరావతి రోడ్ ఎన్టీఆర్​ నగర్​కు చెందిన ప్రవీణ్, కారంపూడి మండలం చింతపల్లికి చెందిన కొండలరావు ఇద్దరు మిత్రులు. ఇరువురు కలసి మద్యం తాగారు. ఆ తర్వాత నరసరావుపేట నుంచి గుంటూరు వెళుతున్నారు. ఫిరంగిపురం మండలం మేరకపూడి వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పింది. పక్కనే ఉన్న రోడ్డు విభాగినిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడ్డారు. తీవ్రగాయాల పాలయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ఇద్దరిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తుండగా... మార్గమధ్యలో ప్రవీణ్ మృతి చెందాడు. కాగా... వీరు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండీ... ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.