Motha Mogiddam Programme in All Over Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కి మోతమోగించారు. వివిధ రూపాల్లో పెద్దఎత్తున శబ్ధాలు చేస్తూ నిరసన తెలిపారు. భారీగా రోడ్లపైకి చేరుకున్న తెలుగుదేశం శ్రేణులు, ప్రజలు డప్పులు, కంచాలు వాయిస్తూ, బూరలు ఊదుతూ హోరెత్తించారు. వాహనాల హారన్‌లతో రాష్ట్రంలో రహదారులు దద్దరిల్లాయి. రాజకీయంగా ఎదుర్కోలేకే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ శబ్దహోరుతో శ్రేణులు కదం తొక్కారు.
తెలుగుదేశం చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమంతో రాష్ట్రం దద్దరిల్లింది. రాజమహేంద్రవరంలో నారా బ్రాహ్మణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోతమోగించారు. విజిల్ ఊదుతూ, డప్పు కొడుతూ భిన్న రూపాల్లో ప్రజలు నిరసన తెలిపారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్ద.. నారా భువనేశ్వరి డ్రమ్స్ వాయిస్తూ నిరసన తెలిపారు. దిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసం వద్ద పార్టీ నేతలతో కలిసి లోకేశ్ గంట మోగించారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టి తాళం వేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
జగన్ చేస్తున్న దుష్ప్రాచారం పైన.. పెట్టిన దొంగ కేసులకు వ్యతిరేకంగా.. చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి అనేక కార్యక్రమాలు తీసుకువెళ్తాం" -నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
TDP Motha Mogiddam Program Telangana : చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలంగాణలో 'మోత మోగింది'
"ఈ కార్యక్రమం చంద్రబాబుకు న్యాయం జరగటానికి చేసే కార్యక్రమం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని మనం కోరుకునే కార్యక్రమం. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు" -నారా బ్రాహ్మణి, లోకేశ్ సతీమణి
"మేము శబ్దం వినిపించేది ప్రజల్లోకి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ చెడు నుంచి బయటకు రావటానికి మనం చేస్తున్న కార్యక్రమం ఇది. సత్యమేవజయతే." -నారా భువనేశ్వరి, చంద్రబాబు సతీమణి
TDP Motha Mogiddam Program: చంద్రబాబుకు మద్దతుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మోగిన మోత..
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నేతలు భిన్న రూపాల్లో ధ్వనులు చేసి హోరెత్తించారు. సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోని మహిళలందరూ కంచాలు మోగిస్తూ టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు.
విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో డప్పులు, గంటలతో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటశాల మండలం తాడేపల్లిలో జోరు వానని సైతం లెక్కచేయకుండా అభిమానులు బైక్ హారన్లు మోగిస్తూ నిరసన తెలిపారు.
"ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గూబ గుయ్యుమనేలా మోత మోగించి నిరసన తెలియజేశారు. 1983లో ఎన్టీఆర్‌ను ఇందిరాగాంధీ పదవిని తీసేసుకున్నప్పుడు.. తెలుగు ప్రజలు ఎలా స్పందించారో.. ఇప్పుడు అలాగే స్పందించారు." -అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
గుంటూరు టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో యువత..శబ్ధహోరుతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. బృందావన్ గార్డెన్స్‌లో మహిళలు పెద్దఎ్తతున రోడ్డుపైకి చేరుకుని నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకి భారీగా చేరుకున్న శ్రేణులు.. విజిల్స్, డ్రమ్స్‌తో హోరెత్తించారు. చిలకలూరి పేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కంచాలు, గరిటెలతో మోత మోగిస్తూ నిరసన తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతులు, మహిళలు చంద్రబాబుకు మద్దతుగా బూరలు ఊదుతూ ర్యాలీ నిర్వహించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రేణులు విజిల్స్ వేస్తూ, బైక్ హారన్లు మోగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రేణులతో కలిసి గంట కొడుతూ.. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. నెల్లూరు సంతపేటలో ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి కారు హారన్లు మోగిస్తూ, గెరిటలతో పళ్లాలను కొడుతూ.. మోత మోగించారు.
మోత మోగిన ఆంధ్రప్రదేశ్... రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన చంద్రబాబు అభిమానులు
తిరుపతి టీడీపీ కార్యాలయం వద్ద విజిల్స్, బూరలు ఊదుతూ, కంచాలతో శబ్దాలు చేస్తూ హోరెత్తించారు. కడప ఎర్రముక్కపల్లి సర్కిల్‌లో పళ్లాలు గరిటెలతో శబ్ధాలు చేస్తూ, విజిల్స్ వేస్తూ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో ఎమ్మెల్సీ భూంరెడ్డి రాంగోపాల్ రెడ్డి డప్పుకొట్టి.. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరులోని శివాలయం కూడలిలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి శ్రేణులతో కలిసి మానవహారంగా ఏర్పడి కంచాలు కొడుతూ, డాన్స్ వేస్తూ మోత మోగించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పళ్లాలను గరిటెలతో కొడుతూ మోతమోగించారు. అనంతపురంలో పెద్దఎత్తున కాగడాల ర్యాలీ నిర్వహించారు. డప్పులు కొడుతూ, ఈలలు వేస్తూ.. చంద్రబాబుకు మద్దతు తెలిపారు. కర్నూలులోని కల్లూరులో మేము సైతం బాబు కోసమంటూ.. చిన్నారులు చప్పట్లు కొడుత బాబుకు మద్దతు తెలిపారు.
మోత మోగిద్దాంలో నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి.. దిల్లీ నుంచి గల్లీ వరకు కదిలిన పసుపుసైన్యం
విశాఖ సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ వద్ద విజిల్స్ ఊదుతూ, ప్లేట్లను గరెట్లతో కొడుతూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.. సిరిపురం జంక్షన్‌లోని దత్ ఐల్యాండ్‌కి భారీగా చేరుకున్న మహిళలు విజిల్స్ వేస్తూ, కంచాలు మోగిస్తూ నిరసన తెలిపారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో తెలుగుదేశం శ్రేణులతో కలిసి బేబీనాయన పళ్లాలను గరిటెలతో కొడుతూ.. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. విజయనగరంలో టీడీపీ నేత అశోక్ గజపతి రాజు ఆధ్వర్యంలో మోత మోగిద్దాం కార్యక్రమానికి జనసైనికులు మద్దతు తెలిపి.. ఈలలు వేస్తూ నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వర్షంలోనూ విజిల్స్ వేస్తూ.. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని గాంధీ విగ్రహం ఎదుట డప్పులతో మోత మోగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. శ్రేణులు చేపట్టిన మోత మోగిద్దాం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది.
TDP Motha Mogiddam Program: చంద్రబాబుకు మద్దతుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మోగిన మోత..