ETV Bharat / state

అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరకులు అందజేత - Guntur District Latest news

మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో బుడగ జంగాల కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి 5 పూరి గుడిసెలు దగ్ధం అయ్యాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అగ్నిప్రమాద బాధితులను పరామర్శించారు. నిత్యావసర సరకులు అందించారు.

MLA Vundavalli Sridevi Visit Fire accident Place
అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరకులు అందజేత
author img

By

Published : Nov 1, 2020, 6:32 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామం బుడగ జంగాల కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి 5 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఎమ్మెల్యే శ్రీదేవి అధికారులను అప్రమత్తం చేసి.. సకాలంలో అగ్నిమాపక సిబ్బందిని ఘటన స్థలానికి చేరేలా చూశారు. పేరేచర్ల బుడగజంగాల కాలనీలో పర్యటించారు. బాధితులకు భరోసా కల్పించారు.

బాధితులకు నిత్యావసర సరకులు అందించి.. వారు తాత్కాలికంగా కమ్యూనిటీ సెంటర్​లో ఉండే ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదంలో ఆశ్రయం కోల్పోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించేలా చూస్తానని చెప్పారు. వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఉదాసీనతే పోలవరానికి శాపం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.