గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మానుకొండ వారి పాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే విడుదల రజిని ప్రారంభించారు. రైతు కోసం ఎంత సాయం చేసేందుకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే రజిని తెలిపారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులన్నీ ఇకపై రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందుతాయని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలకు ఒక్కో స్మార్ట్ టీవీ ఉంటుందని, వాటి ద్వారా పం ధరలు, పంటల సమాచారం, సాగుపై అవగాహన, శిక్షణ, శాస్త్రవేత్తలతో ముఖాముఖి తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు.
ఇదీ చూడండి