MLA Vasantha Krishnaprasad: గత ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. పార్టీలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే కూర్చుని పరిష్కరించుకుందామని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. మైలవరం నుంచి సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం సీఎం జగన్‌దేనని స్పష్టం చేశారు.
16 నెలల్లో ఎన్నికలున్నాయి.. పార్టీ గెలుపు కోసం సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. జోగి రమేశ్‌తో ఏంటి విభేదాలు ఏంటి అని అడిగారు. ఏవైనా ఉంటే చర్చించి పరిష్కరించుకుందామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ నిర్ణయమే నాకు శిరోధార్యం. -వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే
ఇవీ చదవండి: