ETV Bharat / state

MLA Sridevi: నేను అలా అనలేదు.. ఆ వీడియో ఎడిటింగ్ చేశారు: ఎమ్మెల్యే శ్రీదేవి - ఉండవల్లి శ్రీదేవి న్యూస్

MLA Sridevi: ఇటీవల ప్రపంచ 4వ మాదిగ మహాసభలో తాను చేసిన ప్రసంగాన్ని ఎడిటింగ్ చేసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్​ను తాను అవమానపరచేలా మాట్లాడలేదని.. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తాను మాట్లాడిన వీడియోని ఎడిటింగ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

అంబేడ్కర్​ను అవమానపరచలేదు.. ఆ వీడియో ఎడిటింగ్ చేశారు

author img

By

Published : Dec 31, 2021, 4:40 PM IST

అంబేడ్కర్​ను అవమానపరచలేదు.. ఆ వీడియో ఎడిటింగ్ చేశారు

MLA Sridevi: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్​ను తాను అవమానపరచేలా మాట్లాడలేదని.. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఇటీవల ప్రపంచ 4వ మాదిగ మహాసభలో తాను చేసిన ప్రసంగాన్ని ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తన ప్రసంగంలో తెలియక తప్పులు దొర్లి ఉంటే అంబేడ్కర్​ వాదులు, దళిత బహుజనులు క్షమించాలని కోరారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా అంబేడ్కర్​పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.

అంబేడ్కర్​, జగ్జీవన్ రాం రెండు కళ్లలాంటి వాళ్లు..

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలి నాళ్లలో కొంత మంది కులవాదులు వ్యతిరేకించినప్పటికీ.. ఆయనతో పాటు రాజ్యాంగ కమిటీ సభ్యుడిగా పని చేసిన బాబు జగ్జీవన్​రాం పార్లమెంటులో రాజ్యాంగ ప్రతి ఫలాలలను కింది స్థాయికి చేర్చేందుకు బలియంగా కృషి చేశారని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అంబేడ్కర్ మరణానంతరం రాజ్యాంగ పరిరక్షణకు బాబు జగ్జీవన్​రాం వేసిన బాటలు.. సత్ఫలితాలు ఇచ్చాయన్న భావాన్ని మాదిగ మహాసభలో ప్రస్తావించానన్నారు.

ఎవర్ని వదిలిపెట్టేది లేదు..

కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు కొంతమంది కావాలనే దుష్ప్రచారానికి పూనుకున్నారని శ్రీదేవి మండిపడ్డారు. లేనిపోని ఆరోపణలతో తనపై విష ప్రచారం చేస్తూ.. తాను మాట్లాడిన వీడియోని ఎడిటింగ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇంతకీ.. శ్రీదేవి ఎమన్నారంటే !

ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ 4వ మాదిగ మహాసభలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.."రాజ్యంగం రచించిన అంబేడ్కర్ అందరికి తెలుసు. కానీ రాజ్యంగం పార్లమెంట్​లో అమలయ్యేందుకు బాబు జగ్జీవన్​రాం కృషి చేశారు. స్వాతంత్య్ర సమరంలో ఆయన పోరాటం చేశారు. మనం బాబు జగ్జీవన్​రాంను ఆదర్శంగా తీసుకోవాలి." అని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలు శ్రీదేవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

ఇదీ చదవండి

Minister Sucharitha On Jinnah Tower issue: శాంతిభద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోం - హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.