గుంటూరు జిల్లా మంగళగిరిలో 2 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. మంగళగిరి పురపాలక సంఘ కార్యాలయంలో డీఎస్పీ, సీఐ, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్ తో సమావేశమైన ఆయన... లాక్ డౌన్ ప్రభావంపై ఆరా తీశారు. లాక్ డౌన్, రెడ్ జోన్ నియమ నిబంధనల అమలు చేస్తూనే, ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని కోరారు.
ఇదీ చదవండి: